ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నెలలో ఖతార్‌లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ తన చివరిదని పేర్కొన్నారు. స్టార్ ప్లస్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మెస్సీ వెల్లడించారు. ప్రస్తుతం శారీరకంగా ఫీట్‌గానే ఉన్నప్పటికీ… చివరి ప్రదర్శనకు ముందు కొంత ఆందోళన, ఒత్తిడికి గురయ్యానని చెప్పారు.
వచ్చే ప్రపంచ కప్‌లో ఏదైనా జరగవచ్చని… అన్ని జట్లు బాగానే ఉన్నట్లు వెల్లడించారు. ఫేవరెట్ జట్లు ఎల్లప్పుడూ విజయం సాధించవని మెస్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు. 35 ఏళ్ల లియోనల్ మెస్సీ ఇప్పటివరకు నాలుగు ప్రపంచ కప్‌లకు ప్రాతినిధ్యం వహించగా…2022లో 5వ ప్రపంచ కప్‌లో ఆడనున్నారు. తన కేరీర్లో ఇప్పటివరకు 222 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెల్చుకోగా….770కి పైగా గోల్స్ చేశారు.