»Amitabh Bachchan New Movie Section 84 Video Release
Amitabh Bachchan: కొత్త మూవీ సెక్షన్ 84 వీడియో రిలీజ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొత్త చిత్రం సెక్షన్ 84. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ బిగ్ బీ ప్రకటించారు. ఈ చిత్రానికి యుధ్, Te3nకి దర్శకత్వం వహించిన రిభు దాస్‌గుప్తా డైరెక్షన్ చేస్తున్నారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) 80 ఏళ్ళ వయసులో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ప్రాజెక్టు కే(project K) మూవీలో నటిస్తుండగా..తాజాగా సెక్షన్ 84(Section 84) కోర్ట్‌రూమ్ థ్రిల్లర్(courtroom drama) మూవీలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త మూవీ కోసం సృజనాత్మకమైన వ్యక్తులతో కలిసి చేయడం తనకు మరోసారి ఆనందంగా ఉందని ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ప్రకటించారు. ఈ చిత్రానికి రిభు దాస్‌గుప్తా(Ribhu Dasgupta) రచనతోపాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు.
జియో స్టూడియోస్‌తో కలిసి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ హ్యాంగర్, సరస్వతి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ ప్రాజెక్ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే అమితాబ్ బచ్చన్, దాస్‌గుప్తా(Ribhu Dasgupta)ల కలిసి చేస్తున్న మూడవ చిత్రం ఇది కావడం విశేషం. ఇప్పటికే వీరిద్దరూ యుధ్, Te3nలో కలిసి చేశారు.
తాను అమితాబ్(Amitabh Bachchan)సర్‌తో మళ్లీ కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు రిభూ దాస్‌గుప్తా తెలిపారు. అంతేకాదు గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. మరోవైపు మా చిత్రంలో మిస్టర్ బచ్చన్‌ను కలిగి ఉండటం గౌరవంగా భావిస్తున్నానని నిర్మాత వివేక్ బి అగర్వాల్ అన్నారు. సెక్షన్ 84(Section 84)లో బిగ్ బీ, రిభుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంకోవైపు ఈ చిత్రంలో మరిన్ని నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.