ADB: ప్రజలకు ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్ చునార్కర్ సతీష్ అన్నారు. శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలోని రాంనగర్ కాలనిలో ఉన్న నీటి చేతిపంపు చెడిపోయి కొన్ని నెలలుగా అలాగే ఉంది. దీంతో సమస్య ఆయన దృష్టికి రావడంతో చేతిపంపుకు మరమ్మతులు చేసి నీటిని సరఫరా చేశారు. ఈ మేరకు ప్రజలు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.