మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి నేరేడు గింజల పొడి వరప్రసాదం. ఇందులో జాంబోలిన్, జాంబోసిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో పిండిపదార్థాలు చక్కెరగా మారే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కడుపులో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.