AP: వృద్ధులను పట్టించుకోవడం గొడ్డలి పార్టీకి అలవాటు లేదని ఎమ్మెల్సీ అనురాధ విమర్శించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని సుగాలి కాలనీలో పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. కాలనీలోని వృద్ధులను పలకరిస్తూ.. సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధిని వివరించారు. పింఛన్ రూ.4,000 చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.