»Viral Video Man Takes Suv Under Waterfall And It Starts Leaking
Water leak in SUV:‘ఏ సన్‌రూఫ్ వాటర్‌ప్రూఫ్’ కాదు.. వాటర్ ఫాల్ కింద కారు, నీరు రావడంతో
Water leak in SUV:అరుణ్ పాన్వార్ (arun) అనే వ్యక్తి తన మహీంద్రా స్కార్పియో ఎన్ (scorpio N) సన్ రూఫ్ వెహికిల్‌ను పర్వత ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ చోట నీరు కిందకు పడుతుంది. దాని కిందకు కారు తీసుకెళ్లాడు. సన్ రూఫ్ సరిగా క్లోజ్ చేయకపోవడంతో కారులోకి నీరు వచ్చింది.
Viral Video: Man Takes SUV Under Waterfall And It Starts Leaking
Water leak in SUV:అప్పుడప్పుడు కొందరు అడ్వెంచర్స్ చేస్తుంటారు. ఏదైనా అనుకుంటే.. వెంటనే చేసేస్తారు. దాని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అరుణ్ పాన్వార్ (arun) అనే వ్యక్తి కూడా అలానే చేశాడు. తన మహీంద్రా స్కార్పియో ఎన్ (scorpio N) సన్ రూఫ్ వెహికిల్‌ను పర్వత ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ చోట నీరు కిందకు పడుతుంది. దాని కిందకు కారు తీసుకెళదాం అనుకున్నాడు. వెంటనే అక్కడికి తీసుకెళ్లాడు.
అంతకన్నా ముందు సన్ రూఫ్ (sunroof) క్లోజ్ చేశాడు. ఇక ఏం ఫర్లేదు అనుకున్నాడు. వాటర్ ఫాల్ (water fall) కిందకు కారు తీసుకెళ్లాడు. ఇంకేముంది నీరు పడటంతో కొన్ని క్షణాల పాటు ఆనందించారు. వారి ఎంజాయ్ (enjoy) కొన్ని సెకన్ల ముచ్చటగానే నిలిచింది. వెంటనే కారులోకి నీరు వచ్చింది. దీంతో ఏం జరుగుతుందో కారులో ఉన్నవారికే అర్థం కాలేదు. ‘ఆరే యే క్యా చాలా రాహ హై’ అనే మాట అనగా వీడియోలో స్పష్టంగా వినపడింది.
చదవండి:Viral Video: రాజకీయ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళలు
సన్ రూఫ్ (sun roof) నుంచి నీరు వచ్చింది. కారు (car) లోపల నీరు రావడంతో డ్రైవర్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో కారులోకి పూర్తిగా నీరు చేరలేదు. కారు ఫ్రంట్ సీట్ (front seat) మీద, గేర్ బాక్స్ (gear box) ముందు నీరు నిలిచింది. స్పీకర్ల (speakers) మీద కూడా వాటర్ ఆగింది. ఇంటిరీయర్ మీద కూడా పడింది. దీంతో అతను కాస్త అసహనం వ్యక్తం చేశాడు.
వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే 4.7 మిలియన్ వ్యూస్ (4.7 million views) వచ్చాయి. ఆ వీడియో చూసి షాక్‌నకు గురయ్యా అని ఒకరు రాశారు. అందుకే తాను మహీంద్రా (mahindra) కార్లు కొననని మరొకరు అన్నారు. తన సైకిల్‌తోనే (cycle) సంతోషంగా ఉన్నానని రాసుకొచ్చారు. జీప్‌ను (jeep) చాలాసార్లు కడిగానని.. కానీ ఎప్పుడూ తనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని మరొకరు అభిప్రాయపడ్డారు.
అతను సన్ రూఫ్ కొంచెం ఓపెన్ చేసి ఉంచొచ్చు అని.. అందుకే నీరు కారిందని సందేహాం వ్యక్తం చేశారు. తాను స్కార్పియో ఎన్ (scorpio N) వాడుతున్నానని.. ఇప్పటివరకు అలాంటి ఎక్స్ పీరియన్స్ ఫేస్ చేయలేదని చెప్పారు. బ్రదర్.. ఈ ప్రపంచంలో ఏ సన్ రూఫ్ వాటర్ ప్రూఫ్ (water proof) కాదని మరొకరు అన్నారు. అందులో కొన్ని హోల్స్ ఉంటాయని.. లెప్ట్, రైట్ రెండు చోట్ల ఉంటాయని.. జాగ్రత్తగా చూసి నడపాలని సూచించారు.