TG: కలెక్టర్‌పై దాడి చేసిన వారిని వదిలిపెట్టమని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తెలిపారు. దాడులకు ప్రోత్సహించే వారిని.. దాడి చేసిన వారికి అండగా నిలిచిన వారిని కూడా వదిలిపెట్టమన్నారు. ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరించారు. అధికారులను చంపాలని చూస్తున్న వారిని బీఆర్ఎస్ ఎలా సమర్థిస్తుందని ప్రశ్నిచారు. గతంలో బీజేపీ నేతలు అవినీతిపరులని మాట్లాడి.. ఇప్పుడు మాపై బీజేపీ నేతలకే ఫిర్యాదు చేస్తున్నారని విమర్శించారు.