TG: ఢిల్లీలో నేషనల్ మీడియా కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని..240 సీట్లకే పరిమితమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ 40 నుంచి 100 సీట్లకు చేరుకుంది. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోదీ ఓటమి. మోదీ గ్యారంటీకి వారంటీ పూర్తయింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహా మరికొందరి సహకారంతో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోంది’ అని అన్నారు.