TG: రాష్ట్రంలో ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో మద్నూరు, హుజురాబాద్, కమలాపూర్, జైనూరు, కొడకండ్ల, పాలకుర్తి, హైదరాబాద్, మెట్పల్లి మార్కెట్ కమిటీలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 113 వ్యవసాయ మార్కెట్ కమిటీలు నియమించినట్లు తెలుస్తోంది.