NLG: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోహిణి కార్తె ప్రారంభంలోనే అక్కడక్కడా తొలి వానలు పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతతో నిన్నటి వరకు నిరాశగా ఉన్నా ఈ వర్షాలతో ఒక్కసారిగా సాగు పనులకు శ్రీకారం చుట్టారు. పలు గ్రామాల్లో రైతులు తమ పొలాలను ట్రాక్టర్లతో దుక్కులు దున్నుకుంటూ బిజీబిజీగా మారిపోయారు. రోహిణి కార్తె ప్రవేశంతో వర్షాలు మొదలుకావడంతో వ్యవసాయ పనులకు ఊపొచ్చింది.