SDPT: పోతారం(ఎస్)లో రాత్రి వరండాలో నిద్రిస్తున్న బొయిని మంజుల మెడలోని పుస్తెలతాడు, చైన్‌ను ఆమె చెల్లెలు విజయభారతి వైర్ కట్టర్‌తో కట్ చేసి దొంగిలించింది. ఎవరికీ అనుమానం రాకుండా అక్క కూతురి చెవి కమ్మలను దాచేసి, దొంగతనం జరిగిందంటూ నాటకమాడింది. పోలీసుల విచారణలో నిజం తేలడంతో నగలు స్వాధీనం చేసుకుని, నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ సదానందం తెలిపారు.
Tags :