»People Told Their Problems To Nara Lokesh In Tanapalli
Nara Lokesh: తనపల్లిలో నారా లోకేష్‌కు తమ సమస్యలు తెలిపిన ప్రజలు
టీడీపీ(TDP) నాయకుడు నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్రను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తనపల్లి వద్ద పాదయాత్ర(Paadayatra) కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన లెవల్ కాజ్ వే(Causeway)ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్నారు. 2021 నవంబర్‌లో వరదల వల్ల స్వర్ణముఖి(Swarnamukhi) నదిపై ఉన్న లెవల్ కాజ్ వే(Causeway)లు కొట్టుకుపోయాయని స్థానికులు వివరించారు.

పూర్తి స్థాయిలో పటిష్టమైన కాజ్ వే(Causeway)లు నిర్మించలేదని, పైపులు పూడ్చి, మట్టిపోసి తూతూ మంత్రంగా పనులు కానిచ్చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ వరదలు(Floods) వస్తే నాణ్యత లేకుండా వేసిన పైపులు, మట్టి రోడ్డు కొట్టుకుపోవడం ఖాయమని, దానివల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని స్థానికులు తమ బాధను చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా తనపల్లి ప్రజలనుద్దేశించి నారా లోకేష్(Nara Lokesh) మాట్లాడుతూ..అసమర్థ వైసీపీ(Ycp) పాలన, అవగాహన లేని సీఎం జగన్(Cm Jagan) వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. వర్షాకాలంలో కనీస అంచనాలు లేకుండా జగన్(Jagan) ప్యాలస్ లో నిద్రపోవడం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 మంది సీఎం జగన్(Cm Jagan) పొట్టనపెట్టుకున్నారన్నారు.
నీటి నిర్వహణలో జగన్ సర్కార్(Cm Jagan) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. స్వర్ణముఖి నదిపై ఉన్న 7 లోలెవల్ కాజ్ వే(Causeway)లు వరదల్లో దెబ్బతిన్నాయని, తాత్కాలికంగా మట్టి, పైపులు వేసి సీఎం జగన్ సర్కార్ చేతులు దులుపుకుందన్నారు. ఇలాంటి పనులు వల్ల ప్రమాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. కాజ్ వే(Causeway)లు కొట్టుకుపోయి ఏడాది అవుతున్నా వైసీపీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. టీడీపీ(TDP) అధికారంలోకి వస్తే వెంటనే ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, కాజ్ వేలు(Causeway) నిర్మిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు.