TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ బాధితులు ఎక్కడ ఉన్నారు? పాదయాత్ర ఎక్కడ చేస్తున్నారని ప్రశ్నించారు. పుండు ఒక చోట అయితే మందు మరోచోట అన్నట్లు సీఎం పాదయాత్ర ఉందని ఎద్దేవా చేశారు. ‘వేల ఇళ్లు కూల్చి లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే ప్రణాళిక. హైదరాబాద్లో మూసీ పరివాహకంలో పాదయాత్ర చేసే చిత్తశుద్ధి మీకుందా?. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే’ అని మండిపడ్డారు.