హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్శిటీలో విద్యార్ధి సంఘాల మధ్య వివాదం తలెత్తి ఘర్షణలకు దారి తీసింది. మొన్న మధ్య బీసీసీ (BBC) డాక్యుమెంటరీ ప్రదర్శనపై గొడవ జరిగింది. ఇప్పుడు మరోసారి గొడవలు మొదలయ్యాయి. గచ్చిబౌలిలోని హెచ్ సీ యు వార్తల్లో నిలిచింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్శిటీలో విద్యార్ధి సంఘాల మధ్య వివాదం తలెత్తి ఘర్షణలకు దారి తీసింది. మొన్న మధ్య బీసీసీ (BBC) డాక్యుమెంటరీ ప్రదర్శనపై గొడవ జరిగింది. ఇప్పుడు మరోసారి గొడవలు మొదలయ్యాయి. గచ్చిబౌలిలోని హెచ్ సీ యు వార్తల్లో నిలిచింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ) లో విద్యార్థి సంఘం ఎన్నికల(Election) క్రమంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఏబీవీపీ (ABVP)పోస్టర్లను చించి వేస్తుండగా ప్రశ్నించిన విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ (SFI) విద్యార్థులు దాడిచేసినట్టు ఆరోపించారు.
శుక్రవారం రాత్రి ఎలక్షన్ ముగిసిన తర్వాత ఒంటి గంటకి ఏబీవీపీ పోస్టర్లును కేరళ కి( Kerala) చెందిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి చించి వేస్తుండగా ప్రశ్నించిన రాజేందర్ నాయక్, సిద్దం శుక్ల, ఆకాశ్ బాటి అనే ఏబీవీపీ విద్యార్థుల పై ఎస్ఎఫ్ఐ(SFI) విద్యార్థులు దాడికి పాల్పడ్డారని సమాచారం.హాస్టల్లో వాటర్ పట్టుకుంటుండగా ఏబీవీపీ పోస్టర్లను చించ్చుతుండగా ప్రశ్నించిన రాజేందర్ నాయక్ పై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు దాడికి పాల్పడ్డారని సంబంధిత విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఆగకుండా అక్కడే ఉన్న అద్దం పగలగొట్టి, దాడితో దాడి చేశారని ఆరోపించారు. తీవ్ర గాయాల పాలైన రాజేందర్ నాయక్ సిద్దాం శుక్ల, ఆకాశ బాటి అనే ఏబీవీపీ (ABVP) విద్యార్థులను గచ్చిబౌలిలోని (Gachibowli) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వర్శిటీలోని త్వలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆధిపత్యం కోసం విద్యార్థి సంఘాలు ఘర్షణలకు దిగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. రెండు పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల మధ్య ఈ ఘర్షణపూరిత వాతావరణం కనిపిస్తోంది. రాత్రి కూడా ఇలాంటి ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు చెందిన విద్యార్థులు గాయపడ్డారు.
వివాదం గురించి సమాచారం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపు చేశారు. ఇరు వర్గాలను సర్ది చెప్పి పరిస్థితి చక్కదిద్దారు. ఏబివీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పరస్పర దాడులకు దిగారని పోలీసులు (Police) తెలిపారు. ఘటనపై ఇరు వర్గాలు ఫిర్యాదులు చేసినట్టు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని… ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కొంతమంది పోలీసులను అక్కడే ఉంచామన్నారు. మరిన్ని గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగే ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితులో ఉన్నందునే ఏబీవీపీ(ABVP) దాడులు చేస్తోందని ఆరోపిస్తున్నారు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు. విద్యార్థులను రెచ్చగొట్టి భయపెట్టి తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు ఎవరూ వారి ట్రాప్లో పడొద్దని అందరూ ఐక్యంగా ఉండి ఏబీవీపీ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచిస్తున్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు
Hyderabad, Telangana | Students of ABVP & SFI clash at Hyderabad central university over student union elections. ABVP alleged that SFI students inflicted violence against the tribal students of ABVP & used sharp objects to attack them. pic.twitter.com/4j2i2Koz7U