avinash reddy:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని (avinash reddy) సీబీఐ అధికారులు సుధీర్ఘంగా విచారించారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఎంక్వైరీ జరిగింది. వివిధ అంశాలపై నాలుగున్నర గంటల పాటు ప్రశ్నలు వేశారు.
Avinash told CBI that there was a letter when I left
avinash reddy:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని (avinash reddy) సీబీఐ అధికారులు సుధీర్ఘంగా విచారించారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఎంక్వైరీ జరిగింది. వివిధ అంశాలపై నాలుగున్నర గంటల పాటు ప్రశ్నలు వేశారు. విచారణ తర్వాత అవినాశ్ రెడ్డి (avinash reddy) మీడియాతో మాట్లాడారు. గత నెల 28వ తేదీన తనను సీబీఐ విచారించిందని.. దానికి కొనసాగింపుగా ఈ రోజు విచారించిందని వెల్లడించారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు.
వాస్తవాలనే రాయాలని మీడియాను అవినాశ్ రెడ్డి (avinash reddy) కోరారు. తాను గతంలో ఇదే విషయం చెప్పానని తెలిపారు. ఇదవరకు విజయమ్మ వద్దకు వెళితే బెదిరించి వచ్చానని ప్రచారం చేశారు. ఆ అంశంపై డిబేట్లు కూడా పెట్టారు. దుబాయ్‌కి వెళ్లిపోయానని, తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్లు చేశానని తప్పుగా రాశారని పేర్కొన్నారు. హత్య కేసులో దోషులెవరో, నిర్దోషులెవరో మీడియానే నిర్ధారిస్తే దర్యాప్తు సంస్థల విచారణపై అది ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. నిజాన్ని వంద నుంచి సున్నాకు తగ్గించే ప్రయత్నం జరుగుతోందని అవినాశ్ రెడ్డి (avinash reddy) తెలిపారు. వాస్తవాలను వెలికితీసే క్రమంలో బాధ్యతగా వ్యవహరించాలని మీడియాను ప్రత్యేకంగా కోరారు.
చదవండి:sajjala on viveka murder case:సజ్జల సంచలనం.. వివేకా కేసు తీరుపై సందేహాలు
వివేకా హత్య కేసులో తెలిసిన విషయాలు అన్నీ చెప్పాను. మళ్లీ విచారణకు రావాలని సీబీఐ అధికారులు అడగలేదని అవినాశ్ రెడ్డి (avinash reddy) చెప్పారు. ఈ కేసులో మొదటి నుంచి వాస్తవాల కంటే కూడా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాస్తవాలతో సీబీఐ అధికారులకు రిప్రజంటేషన్ ఇచ్చానని వివరించారు. వాటిపై విచారణ జరగాలని కోరానని తెలిపారు. గూగుల్ టేక్ ఔట్ అంటున్నారు.. గూగుల్ టేక్ ఔటో, టీడీపీ టేక్ ఔటో కాలమే నిర్ణయిస్తుందని వివరించారు. సీబీఐ కౌంటర్ అఫిడవిట్లో ఏ అంశాలు అయితే ఉన్నాయో, అవే అంశాలు టీడీపీ నేతలు వాళ్లు ఏడాది కిందట ప్రస్తావించారని పేర్కొన్నారు. ఆ విషయాలే సీబీఐ అఫిడవిట్ లో ఉన్నాయి. దీనిని బట్టి సీబీఐ విచారణ పట్ల ఎవరికైనా సందేహాలు కలుగుతాయని తెలిపారు.
వివేకా చనిపోయిన రోజున మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడానని అవినాశ్ రెడ్డి (avinash reddy) గుర్తుచేశారు. రెండ్రోజుల తర్వాత మీడియాతో మాట్లాడాను. ఆ రోజున ఏం మాట్లాడానో ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నా.. సీబీఐ వారితో అదే చెప్పాను. మళ్లీ ఎన్నిసార్లు ఎవరు పిలిచి అడిగినా అదే చెబుతాను. ఎందుకంటే నాకు తెలిసింది అదేనని అవినాశ్ (avinash reddy) అన్నారు. ఈ కేసులో సాక్షినో, అనుమానితుడినో తెలియదని.. తనకు 160 సీఆర్పీ కింద నోటీసులు ఇచ్చారని వివరించారు. వివేకా హత్య జరిగిన తర్వాత ఘటన స్థలానికి వెళ్లే సరికి అక్కడ ఒక లేఖ ఉందని చెప్పారు. ఆ లెటర్‌ను దాచిపెట్టేశారు. అది హత్య అని ఆ లేఖలో స్పష్టంగా ఉంది. లేఖపై సీబీఐ అధికారులు ఏం నిర్ణయించుకుంటారో చూడాలని అన్నారు. విచారణను న్యాయవాది పర్యవేక్షణలో.. ఆడియో-వీడియో రికార్డింగ్ జరపాలని అడిగానని గుర్తుచేశారు. విచారణ రికార్డింగ్ చేసినట్టు తనకు అనిపించలేదని అన్నారు. లోపల ఒక ల్యాప్ టాప్ మాత్రం తన వద్ద ఉందని చెప్పారు.