ఈ మధ్య దొంగలు ఆలయాల మీద పడ్డారు. దేవుని సన్నిధి అనే భయం లేకుండా ఆభరణాలు(Jewelery), హుండీ(Hundi) వంటివి దోచుకుంటున్నారు. తాజాగా కొండగట్టు అంజన్న ఆలయం(Kondagattu Temple)లో దొంగలు(Thieves) పడిన ఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని 15 కిలోల వెండి, బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. గురువారం అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు బేతాళుడి గుడి ప్రాంతం నుంచి ప్రధాన ఆలయంలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు సీసీ ఫుటేజీ(CC Footage)ని పరిశీలించారు. ఆలయం తలుపులను మూసివేసి విచారణ జరుపుతున్నారు. ముగ్గురు యువకుల చేతుల్లో కటింగ్ ప్లేయర్స్ తో పాటుగా ఇతర సామాగ్రి కూడా ఉన్నట్లు సీసీటీవీ(CC Tv) ఫుటేజీలో తెలుస్తోంది. పోలీసులు డాగ్ స్క్వాడ్ టీమ్స్(Dogs squard Teams)ను కూడా కొండగట్టు ఆలయాని(Kondagattu temple)కి రప్పించి సోదాలు నిర్వహిస్తున్నారు. దొంగల ఉనికిని పసిగట్టే పనిలో జాగిలాలు(Police dogs) ఉన్నాయి.
దొంగతనం జరిగిన ప్రదేశంలో దొంగల వేలిముద్రల(Fingerprints) సేకరణతో పాటుగా స్పెషల్ ఇవ్వెస్టిగేషన్ టీమ్స్ కూడా దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అంజన్న ఆలయం(Anjanna Temple)లో రోజూలాగే గురువారం స్వామివారి నిత్య సేవలు ముగిశాక అధికారులు ప్రధాన ద్వారానికి తాళం వేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత ముగ్గురు దొంగలు ఆలయం వెనుక ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలోని స్వామివారి 2 కిలోల వెండి మకర తోరణం, అర్ధ మండపంలోని 5 కిలోల ఆంజనేయస్వామి వెండి ఫ్రేమ్, 3 కిలోల నాలుగు వెండి శఠగోపాలు ఇంకా స్వామివారి 5 కిలోల వెండి తొడుగు, తదితర వెండి ఆభరణాల(Silver Jewelery)ను దోచుకెళ్లారు.
స్వామివారి ఆభరణాలు(Jewelery) దాదాపు 15 కిలోలు వరకూ ఉంటాయని, వాటి విలువ రూ.9 లక్షల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. ఆలయంలో దొంగతనం జరిగిన నేపథ్యంలో భక్తులెవ్వరినీ లోపలికి వెళ్లనివ్వలేదు. చోరీ చేసినవారు స్థానికులా లేక వేరే ప్రాంతం నుంచి వచ్చినవారా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.