మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పట్లో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన రాజ్యసభ పదవీకాలం ఇంకా ఏడాదిన్న ఉందని, ఇది ముగిసిన తర్వాత మరోసారి సభకు వెళ్లాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. లోక్ సభకు మాత్రం పోటీ చేయబోనని తేల్చి చెప్పారు.