అన్నమయ్య: ఉడా అభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆదేశించారు. మదనపల్లెలోని పీకేఎం ఉడా ఆఫీసులో మదనపల్లె, పలమనేరు, కుప్పం, బీ.కొత్తకోట మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉడా అభివృద్ధిపై విధి విధానాలను కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధికి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.