TG: విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇది కూటమి సర్కార్ ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్ అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు.. 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? YCP, ప్రభుత్వానికి తేడా ఏంటి? అని నిలదీశారు. ప్రజల నుంచి ట్రూఅప్ ఛార్జీల రూపంలో అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.