అధిక ధరల నుంచి సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది. భారత్ బ్రాండ్‌పై తక్కువ ధరకే గోధుమ పిండి, బియ్యం విక్రయాల రెండో దశను పునః ప్రారంభించింది. రెండో దశలో భాగంగా 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నుల బియ్యాన్ని FCI నుంచి సేకరించినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోధుమ పిండిని కిలో రూ.30కి, బియ్యం కిలో రూ.34 చొప్పున విక్రయించనున్నట్లు చెప్పారు. ఇవి కూడా 5, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో లభించనున్నాయి.