NGKL: తాడూరు మండలం గోవిందాయిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామ సమీపంలో గొర్రెలు మేపుతున్న సమయంలో అకస్మాత్తుగా వర్షంతో పాటు పిడుగు పడటంతో గొర్రెల కాపరి మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.