AP: విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. మార్చి 16 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉ.8 నుంచి మ.12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని వెల్లడించింది. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ మార్చి 16 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.