Agent Movie Promo : ‘ఏజెంట్’ ఫస్ట్ సింగిల్ ముహూర్తం ఫిక్స్.. ప్రోమో అదిరింది!
Agent Movie Promo : ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రిలీజ్‌కి రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. అఖిల్ అక్కినేని నటిస్తున్న 'ఏజెంట్' మూవీపై భారీ అంచనాలున్నాయి. హాలీవుడ్ లెవెల్లో హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.
Agent Movie Promo : ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రిలీజ్‌కి రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీపై భారీ అంచనాలున్నాయి. హాలీవుడ్ లెవెల్లో హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమా ఇదే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి క్లాసిక్ హిట్ తర్వాత.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాతో మాసివ్ హిట్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం చాలా రిస్క్ చేస్తున్నాడు. సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ బాడీతో బీస్ట్‌లా తయారయ్యాడు. అయితే ఇప్పటి వరకు ఏజెంట్‌ను స్పైగానే చూశాం. కానీ ఇప్పుడు లవ్ మిషన్ స్టార్ట్ చేశాడు. ఏజెంట్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. మల్లి మల్లి అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో అదిరిపోయేలా ఉంది. మెలోడి ట్రాక్‌లా ఉన్న ఈ సాంగ్.. అదిరిపోయే లొకేషన్లో షూట్ చేసినట్టు చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా ఈ ట్రాక్‌ను సాలిడ్‌గా కొట్టినట్టు తెలుస్తోంది. సినిమా ఎంత స్టైలిష్‌గా ఉందో.. ఈ సాంగ్ కూడా అంతే బ్యూటీఫుల్‌గా అనిపిస్తోంది. ఫుల్ సాంగ్‌ను ఫిబ్రవరి 22న, అంటే రేపు సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సాంగ్ ప్రోమో చూసిన తర్వాత.. ఏజెంట్ మ్యూజిక్ ఆల్బమ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఏజెంట్ సినిమాను సురేందర్ 2 సినిమాస్‌తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఏప్రిల్ 28న ఏజెంట్‌ను వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.