మరికొన్ని గంటల్లో ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ రిజల్ట్ తేలిపోనుంది. ఆచార్య ఫ్లాప్‌తో డీలా పడిపోయిన మెగాభిమానులు.. ‘గాడ్ ఫాదర్’మాసివ్ హిట్ ఇవ్వడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘గాడ్ ఫాదర్’ బిజినెస్ 70 కోట్లకు పైగా జరిగినట్టు ట్రేడ్ వర్గాల టాక్. అయితే హిందీలో ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తోంది. హిందీతో పాటు రెస్ట్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని.. మొత్తంగా గాడ్ ఫాదర్ 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 92 కోట్లని చెప్పొచ్చు. ఇక థియేట్రికల్ రైట్స్‌తో పాటు నాన్ థియేట్రికల్ బిజెనెస్ కూడా గట్టిగానే జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్.. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందట. అలాగే ఆడియోతో పాటు శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే జరిగిందంటున్నారు. ఇదిలా ఉంటే.. గాడ్ ఫాదర్ సీక్వెల్‌కు ఛాన్స్ ఉందంటున్నారు. ప్రమోషన్లో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు మెగాస్టార్. అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేదు. బహుశా గాడ్‌ఫాదర్ రిజల్ట్‌ను బట్టి సీక్వెల్‌కు ఉంటుందేమో. అయితే గాడ్ ఫాదర్ ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో ‘లూసీఫర్’కు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. కాబట్టి లూసీఫర్ 2 హిట్ అయితే గాడ్ ఫాదర్ 2 ఉంటుందని చెప్పొచ్చు.