»Ys Sharmila Complaint To Women Commission For Brs Leaders
ys sharmila: మహిళ కమిషన్‌కు ఫిర్యాదు.. బీఆర్ఎస్ నేతల కామెంట్లపై చర్యలు
ys sharmila:బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. అత్యాచారాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందన్నారు. మద్యం అమ్మకాలు, డ్రగ్స్ విచ్చల విడిగా అమ్ముతున్నారని గుర్తుచేశారు.
ys sharmila:బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) ఈ రోజు రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. అత్యాచారాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు ఉందన్నారు. మద్యం అమ్మకాలు, డ్రగ్స్ విచ్చల విడిగా అమ్ముతున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్ (hyderabad) నగరంలో కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జట్టు పట్టుకొని అరెస్ట్
మహిళలు ఆందోళన చేస్తే జుట్టు పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారని షర్మిల (ys sharmila) మండిపడ్డారు. జైలులో పెట్టి చిత్ర హింసలకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. మహిళల పట్ల దాడులు జరుగుతుంటే బీఆర్ఎస్ మహిళ నేతలు మాట్లాడరని పేర్కొన్నారు. గవర్నర్‌ను (governer) అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. తను 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కేసీఆర్ సర్కార్‌ను నిలదీస్తే నానా మాటలు అంటున్నారని తెలిపారు. పాదయాత్రలో సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించానని తెలిపారు. ఎమ్మెల్యే ల అవినీతి, అక్రమాల గురించి మాట్లాడితే చాలు.. మాటల దాడి చేస్తున్నారని పేర్కొన్నారు.
మంత్రి మరదలు
మహిళ అని చూడకుండా ఓ మంత్రి (minister) మరదలు అంటాడు.. మరో మంత్రి శిఖండి అని అంటారు. మరొకరు నల్లిని నలిపినట్లు నలుపుతా అంటారు. ఎట్లా బయట తిరుగుతావో చూస్తా అని మరొకరు అంటారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే మర్యాద ఇదేనా అని అడిగారు. మహిళలు రాజకీయం చేయకూడదా..? చేస్తే నోటికొచ్చినట్లు మాట్లాడుతారా అని అడిగారు. తనను దూషించిన వారిని పేర్లతో సహా ఫిర్యాదు చేశానని తెలిపారు. చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను కోరామని తెలిపారు.
ఇతరులను కూడా గౌరవించలే
ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) తననే కాదు ఇతర మహిళలను కూడా అవమానించాడని తెలిపారు. మహిళా ఐఏఎస్ అధికారి చేయి పట్టుకున్నాడని.. ఇలాంటి వారికి మహిళల మీద గౌరవం ఉన్నట్లా.? అని అడిగారు. సీఎం కేసీఆర్ బిడ్డ లిక్కర్ స్కాంలో ఉన్నారు. శంకర్ నాయక్ భార్య ఏకంగా భూ కబ్జాలకు పాల్పడుతోంది. అవినీతిని ప్రశ్నిస్తే.. ఇంత రాద్దాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు అంతా ఏకతాటిపై రావాలని సూచించారు. BRS సర్కార్‌కి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించాలని కోరారు. BRS నాయకుల ఆగడాలను నిలువరించాలని కోరారు. తమకు ఇక్కడ న్యాయం జరగకుంటే జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తాం అని తెలిపారు.
ఆయనే కొజ్జా అన్నాడు
తను శంకర్ నాయక్‌ను దూషించలేదు.. ఆయనే తనను వలసదారు అన్నాడు, కొజ్జా లాగ ఉంటారు అన్నాడని గుర్తుచేశారు. తనను కొజ్జా అని అంటేనే అనాల్సి వచ్చిందన్నారు. మహిళ మంత్రి శిఖండి అని అంటే… ఏమి అనలేదు. మంత్రి నిరంజన్ రెడ్డి (niranjan reddy) మరదలు అంటే.. ఏవడ్రా మరదలు అన్నాను. కానీ వ్యక్తి గత దూషణలు చేయలేదని షర్మిల అన్నారు. ఎమ్మెల్యేను కొట్టమని చెప్పలేదు, ఎమ్మెల్యే వాహనాలు ధ్వంసం చేయమని చెప్పలేదన్నారు. తన వ్యాఖ్యలకు రెచ్చి పోయి ఎమ్మెల్యే మీద దాడులు జరగలేదన్నారు. ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణల మీద మాత్రమే మాట్లాడామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు (cm kcr) మహిళల మీద గౌరవం లేదని.. ఉంటే నాలుగేళ్లుగా మహిళా కమిషన్‌ను పెండింగ్ లో పెట్టరని అన్నారు. శ్రీకాంతా చారి తల్లి ఓడిపోతే కనీసం పట్టించుకోలేదన్నారు. ఆయన బిడ్డ ఓడిపోతే మళ్ళీ పదవీ ఇచ్చాడని గుర్తుచేశారు.