Earthquake: ఏపీలోని రెండు జిల్లాల్లో భూకంపం..పరుగులు తీసిన జనం
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం(Earthquake) సంభవించింది. ఎన్టీఆర్(NTR) జిల్లా, పల్నాడు(Palnadu) జిల్లాలో భూ ప్రకంపనలు జరిగాయి. భూమి పలుసార్లు కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం(Earthquake) సంభవించింది. ఎన్టీఆర్(NTR) జిల్లా, పల్నాడు(Palnadu) జిల్లాలో భూ ప్రకంపనలు జరిగాయి. భూమి పలుసార్లు కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఎన్టీఆర్(NTR) జిల్లాలోని నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో భూమి కంపించింది. అలాగే ఏపీలోని మరో జిల్లా అయిన పల్నాడు జిల్లాలో కూడా భూమి కంపించింది. పల్నాడులోని అచ్చంపేట మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అచ్చంపేట మండలంలోని మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో భూకంపం(Earthquake) సంభించింది. అయితే స్వల్ప భూకంపం(Earthquake) వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో కూడా భూ ప్రకంపనలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. భూమి కంపించడం వల్ల ప్రజలు భయాందోళన చెందారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ భూకంపం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప(Earthquake) తీవ్రతను అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది.