Cash Seized In Ntr District : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో డబ్బు పట్టుబడుతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో లారీలో తరలిస్తున్న రూ. .8.40 కోట్ల డబ్బు పోలీసుల దృష్టికి వచ్చింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు లారీని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జగ్గయ్య పేట మండలం గరికపాడు చెక్పోస్ట్ దగ్గర తాము తనిఖీ చేస్తుండగా ఈ సొమ్మును గుర్తించామన్నారు.
ఈ డబ్బును తరలించేందుకు వారి దగ్గర ఎలాంటి అనుమతులూ లేవన్నారు. దీంతో ఆ మొత్తాన్ని స్వాధీనం(Cash Seized) చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఐటీ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వారిని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నారు? ఎవరి కోసం తీసుకు వస్తున్నారు? ఎందుకు అనుమతులు తీసుకోలేదు? తదితర కోణాల్లో నిందితులను ప్రశ్నించనున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఏప్రిల్ నెలలో కూడా ఇదే తరహాలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రెండు కోట్లకు పైగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.