KDP: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పబ్లిక్ పరీక్షల సమయంలో హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్ ఎగ్జామ్స్ సందర్భంగా విద్యార్థులకు అందుబాటులో ఉండగా, పదవ తరగతి విద్యార్థులకు గత ఏడాది కూడా ఫ్రీ జర్నీ అమలు చేసిన విషయం తెలిసిందే.