KKD: తునిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ డాన్స్ వేసిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు అతనిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ అన్న మీరే తిరిగి నా ఉద్యోగం నాకు ఇప్పించాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నేపథ్యంలో బస్సు నిలిచినప్పుడు విద్యార్థులు అన్న డ్యాన్స్ చేయి అంటే సరదాగా చేసానే తప్ప మరే ఉద్దేశం లేదని వాపోయాడు.