AP: అమెరికాలో మంత్రి లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా టెస్లా కేంద్ర కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. టెస్లా CFO వైభవ్ తనేజాతో ఆయన భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ నెల 25న మంత్రి లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లారు.