NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యనిర్వహణ అధికారి వెంకట శ్రీనివాసులు రెడ్డి సోమవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు.