EG: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చే యాత్రికులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని కొత్తపేట నియోజకవర్గ ఎంఎల్ఎ బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం ఆయన వాడపల్లి దేవస్థానం ప్రాంగణంలో యాత్రికుల సౌకర్యార్థం పలు అభివద్ధి పనులను శంకుస్థాపనలు చేశారు.