TG: పోలీసుశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళన చేపట్టిన టీజీఎస్పీ సిబ్బందిపై చర్యలు చేపట్టింది. 10 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగిస్తూ ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. 17వ బెటాలియన్‌కు చెందిన ఆరుగురు, 12వ బెటాలియన్‌కి చెందిన ఇద్దరు.. 6, 3వ బెటాలియన్ల నుంచి ఒక్కొక్కరిని డిస్మిస్ చేశారు. కాగా, నిన్న 39 మంది కానిస్టేబుల్స్‌పై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.