మెదక్: విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి విద్యార్థుల వివరాల ప్రకారం.. పాఠశాలలో సమ్మెటీవ్ పరీక్షలు జరుగుతున్నాయి. కౌడిపల్లికి చెందిన ఓ విద్యార్థి తండ్రి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలని మందలించాడు. ఈ క్రమంలో విద్యార్థి తరగతి గదిలోనే ఎలుకల మందు తాగాడు. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేయగా వారు మెదక్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.