NGKL: అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి పునరావాస కమిటీ సభ్యులు సోమవారం జిల్లా నూతన కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి తరలిస్తున్న నాలుగు గ్రామాల పునరావాస ప్రక్రియ, ఎదురవుతున్న సమస్యలను ఈ సందర్భంగా కలెక్టర్‌కు వివరించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పనులు వేగవంతం చేయాలని కోరారు.