SRPT: తుంగతుర్తి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ లైన్ల తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగిస్తున్నందున ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సురేందర్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని తుంగతుర్తి, గానుగుబండ గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.