కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో డ్రైనేజ్ సమస్యపై ఉందని వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీడీవో ఇమ్రాన్ బుధవారం పరిశీలించారు. గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజ్ నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయగా, సమస్య తీవ్రతను స్వయంగా పరిశీలించిన ఎంపీడీవో సంబంధిత పంచాయతీ సిబ్బందికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.