నల్లగొండ రీజియన్ పరిధిలో ఇంజనీరింగ్ మరియు డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి తెలిపారు. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ / డిప్లొమా అభ్యర్థులు NATS వెబ్సైట్ https://nats.education.gov.in ను మార్చి 5 వరకు సందర్శించి నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 75691 18549 సంప్రదించాలన్నారు.