New CEO of twitter: కొత్త బాస్ కుక్క బెటర్ అన్న ఎలాన్ మస్క్, నెటిజన్ల ఆగ్రహం
ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అదే సమయంలో వివాదాస్పదంగానూ కనిపిస్తోంది. తన పెంపుడు కుక్క ప్లోకీని ట్విట్టర్ సీఈవో కుర్చీలో కూర్చోబెట్టారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అదే సమయంలో వివాదాస్పదంగానూ కనిపిస్తోంది. తన పెంపుడు కుక్క ప్లోకీని ట్విట్టర్ సీఈవో కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ కుక్కకు సీఈవో (CEO) అని రాసి ఉన్న టీ-షర్ట్‌ను వేశాడు. సీఈవో కుర్చీకి ముందు ఉన్న టేబుల్ పైన… పేరు… ఫ్లోకీ, టైటిల్… చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని రాసిన పేపర్ ఉంచారు. ముందు డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ఫోటోతో.. ట్విట్టర్ కొత్త సీఈవో అంటూ పోస్ట్ చేశాడు. వరుసగా మూడు నాలుగు పోస్టులు పెట్టాడు. ఈ సీఈవో ఇంతకుముందు సీఈవో కంటే చాలా బెట్టర్ అని, ఫైర్ స్టైల్ వర్క్ అంటూ మరో రెండు పోస్టులు చేశారు. ఇంతకుముందు ట్విట్టర్ సీఈవోగా భారతీయుడైన పరాగ్ అగర్వాల్ ఉన్నారు. ఇలా చెప్పడం ద్వారా పరాగ్‌ను పరోక్షంగా అవమానించినట్లుగా భావించవచ్చు. ఈ పోస్టు ద్వారా మస్క్… పరాగ్ పైన తన అక్కసును వెళ్లగక్కాడని అంటున్నారు. ట్విట్టర్‌ను పూర్తిస్థాయిలో తన వశం చేసుకున్న తర్వాత అందులో పని చేస్తున్న కీలక వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు మస్క్. ఈ డీల్ పూర్తయ్యాక పరాగ్, ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ ఓ నెల్ సెగల్‌ను తొలగించారు. వారిపై ఆయన విమర్శలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ తన చేతిలోకి రాగానే ఎన్నో మార్పులు చేశారు. గత ఏడాది పరాగ్‌ను తొలగించిన అనంతరం ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు.
తన పెట్ డాగ్ ప్లోకీని కొత్త సీఈవో అంటూ చమత్కరించడం పట్ల నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే గత సీఈవో కంటే ఫ్లోకీ బాగు అంటూ చేసిన వ్యాఖ్యలపై చాలామంది నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్ డాగ్ కాళ్ల గుర్తును డాక్యుమెంట్‌లోని సిగ్నేచర్ ప్లేస్‌లో పెట్టిన ఓ నెటిజన్.. ఈ సంతకం అదుర్స్ అంటూ ట్వీట్ చేశారు. కొత్త సీఈవో వెకేషన్లో రిలాక్స్ అవుతున్నాడని…. గుడ్ ఛాయిస్ అంటూ… విచిత్రమైన సీఈవో… డాక్ కమ్యూనిటీకి పోస్ట్, ట్విట్టర్ సీఈవో పాలసీ మారిందని… ఇలా స్పందిస్తున్నారు. సీఈవో కుర్చీ పైన కుక్కను కూర్చోబెట్టడం వరకు ఆయన ఇష్టం. కానీ గత సీఈవో కంటే బెట్టర్ అని చెప్పడం పరాగ్‌ను ఉద్దేశించి చేసినవేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర వ్యక్తి అంటూ పరాగ్‌ను పరోక్షంగా పేర్కొంటూ కుక్క బాగా పని చేస్తుందని కామెంట్ పెట్టడం వివక్షకు తెరలేపినట్లుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆయన తీరు భారతీయుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి.
ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్‌ను చేజిక్కించుకున్నారు. వివిధ కారణాల వల్ల ఈ డీల్ పూర్తి కావడానికి ఆరు నెలలకు పైగా సమయం పట్టింది. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేస్తారని అంతకుముందు జోరుగా ప్రచారం సాగింది. ఇందుకు అనుగుణంగా భావప్రకటనా స్వేచ్ఛ అంటూ ట్వీట్ చేసి, కలకలం రేపారు. ఆ తర్వాత ట్విట్టర్‌కు భారీ ఆఫర్ ఇచ్చారు. పెద్ద మొత్తంలో ఆఫర్ రావడంతో ట్విట్టర్ విక్రయానికి షేర్ హోల్డర్లు పచ్చ జెండా ఊపారు. 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. అదే సమయంలో ఖాతాల గురించి చర్చ వెలుగులోకి వచ్చింది. పూర్తి డేటా బయట పెట్టాలని మస్క్ డిమాండ్ చేసినప్పటికీ, అంగీకరించలేదు. డీల్ పైన పూర్తి సమాచారం అప్పుడే ఇచ్చామని చెప్పడంతో, తాత్కాలికంగా బ్రేక్ పడింది. వ్యవహారం కోర్టుకు వెళ్లడం, న్యాయస్థానం కొనుగోలుపై డెడ్ లైన్ విధించడం, ఆ తర్వాత మస్క్ దానిని కొనుగోలు చేయడం జరిగింది. ఎలాన్ ట్విట్టర్ చేజిక్కించుకున్నాక పలువురిని తొలగించాడు.