అప్పటి వరకు భర్త ఆరోగ్యం కోసం ఉపవాసమున్న భార్య తన భర్తకు విషం ఇచ్చి హత్య చేసింది. ఈ ఘటన యూపీలోని కౌశంబి జిల్లా ఇస్మాయిల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం కర్వాచౌత్ సందర్భంగా సవిత తన భర్త శైలేష్ కోసం వ్రతం చేసింది. కానీ భర్తపై అనుమానంతో విషం కలిపిన ఆహారం ఇవ్వగా, అది తిన్న భర్త మరణించాడు. ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. వేరే మహిళతో అక్రమ సంబంధం ఉండటం తట్టుకోలేకే విషం ఇచ్చినట్లు తెలిపింది.