»Former Minister Kuthuhalamma Demised With Unhealthy In Tirupati
Kuthuhalamma: మాజీ మంత్రి కుతుహలమ్మ కన్నుమూత
చిత్తూరు జిల్లాలో కీలక నాయకురాలిగా వ్యవహరించిన ఆమె ఉమ్మడి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. ఆమె మృతికి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించారు. ఆమె ప్రజలకు విశేష సేవలు అందించారని స్మరించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు గుమ్మడి కుతూహలమ్మ (73) (Kuthuhalamma) కన్నుమూశారు. అనారోగ్యంతో (Unhealthy) బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున తన నివాసంలోనే మృతి చెందారు. చిత్తూరు జిల్లా (Chittoor District)లో కీలక నాయకురాలిగా వ్యవహరించిన ఆమె ఉమ్మడి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) గా కూడా పని చేశారు. ఆమె మృతికి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించారు. ఆమె ప్రజలకు విశేష సేవలు అందించారని స్మరించుకున్నారు.
ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించిన కుతూహలమ్మ వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె ఎంబీబీఎస్ చేసి కొంతకాలం వైద్యురాలిగా కొనసాగారు. డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా కొంత కాలం పని చేసింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి రాజకీయ జీవితం ప్రారంభించింది. కాంగ్రెస్ లో కార్యకర్త స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగారు. 1980-85 మధ్య చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. 1991 నుంచి 93 వరకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేదరుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలు అందించారు. 2009లో జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007-2009 వరకు ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో చేరారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు.