NRML: జిల్లాలో బాల్యవివాహాలు,మాదక ద్రవ్యాల వినియోగం,రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గత సంవత్సరం 45, ఈ ఏడాది 2 బాల్యవివాహాలను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.