BJP Leader Clarity on alliance with janasena : జనసేనతోనే కలిసి పోటీ చేస్తాం.. మరోసారి బీజేపీ క్లారిటీ…!
BJP Leader Clarity on alliance with janasena : ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా... ఈ విషయంలో బీజేపీ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. తాము.. జనసేనతోనే పొత్తు పెట్టుకుంటామని.. కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. కాగా... తాజాగా... మరోసారి బీజేపీ నేతలు ఈ విషయంపై స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా… ఈ విషయంలో బీజేపీ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. తాము.. జనసేనతోనే పొత్తు పెట్టుకుంటామని.. కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. కాగా… తాజాగా… మరోసారి బీజేపీ నేతలు ఈ విషయంపై స్పందించారు.
ప్రాంతీయ, కుటుంబ పార్టీలతో ఏపీకి తీరని నష్టం జరుగుతోందని బీజేపీ ఏపీ ఇన్ చార్జ్ సునీల్ థియోధర్ అన్నారు. ఏపీకి న్యాయం చేయగలిగేది సత్తా బీజేపీకి ఉందని అన్నారు. ప్రజల తరపున రోడ్డెక్కి పోరాడతామని తెలిపారు. ఏపీలో టీడీపీ, వైసీపీ విఫలం అయ్యాయని, రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందని విమర్శించారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఏపీలో అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని అబద్ధాలు చెబుతున్నారని సునీల్ విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ను పునర్నిర్మించడం బీజేపీ – జన సేనలకే సాధ్యమని సునీల్ అన్నారు. జన సేన తో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించారు.
ఉమ్మడి అభ్యర్థిగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల తరపున పీవీఎన్ మాధవ్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాధవ్ ను మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జన సేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా మాధవ్ దిగుతున్నారని సునీల్ తెలిపారు.