సత్యసాయి: జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతిచెందారు. కదిరి మండలంలో నిన్న సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కాళసుముద్రం గ్రామానికి చెందిన జయరాం (49) గేదెలను తోలుకొని ఇంటికి వచ్చే సమయంలో పిడుగుపాటుకు గురయ్యారు. గాయపడిన ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందారు.