VSP: రాజ్యసభ సభ్యుడు వైవి.సుబ్బారెడ్డిని ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు బుచ్చెయ్యపేట జడ్పీటీసీ దొండా రాంబాబు గురువారం కలిశారు. విజయవాడలో సుబ్బారెడ్డిని తన కార్యాలయంలో కలిసిన రాంబాబు బుచ్చెయ్యపేట మండలంలో ఉన్న పలు సమస్యలను ఆయనకు విన్నవించారు. తాగునీటి బోర్లు మంజూరుకు, ఇతర సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని సుబ్బారెడ్డికి వినతిపత్రం అందిచారు.