NLG: రైలు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన గురువారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండలం ఆల్వాలపాడు గ్రామానికి చెందిన చిర్ర శ్రవణ్ (16) అనే యువకుడిగా గుర్తించినట్లు తెలిపారు.