NLG: నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్స్ సమీపంలో హజరత్ లతీఫ్ షా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మదీనా మజీద్ నుంచి ప్రారంభమయ్యే గంధం ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొంటారని దర్గా ఉర్సు ఉత్సవ కమిటీ నాయకులు వెల్లడించారు.