టీమిండియా క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీని ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్‌గా పేర్కొన్నాడు. కోహ్లీ సాధించిన ఘనతలను ఏ క్రికెటర్ సాధించలేడని తెలిపాడు. విరాట్ ఒత్తిడిలో జట్టుకు అందించిన విజయాలు, బ్యాటింగ్ రికార్డ్‌లు ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. బాబర్ మంచి ప్లేయర్ అయినప్పటికీ కోహ్లీ స్థాయి వేరని.. అతడితో బాబర్‌కు పోలిక వద్దని తెలిపాడు.