VZM: విజయనగరంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజారును జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి గురువారం సందర్శించారు. స్టాల్స్ ను పరిశీలించి విక్రయాలపై ఆరా తీశారు. మహిళల అభ్యున్నతికి బజారును ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో జనసేన విజయనగరం మండల ఇంచార్జి శ్రీ బొబ్బాది చంద్రనాయుడు పాల్గొన్నారు.