TG: GHMC కమిషనర్గా ఇలంబర్తి బాధ్యతలను స్వీకరించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లోనే రిపోర్ట్ చేయాలని పలువురు ఐఏఎస్ అధికారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఖాళీ అయిన స్థానాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తి నియమితులయ్యారు.